బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే మరాకెష్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివెల్ లో తళుక్కుమంది. పలువురు హాలివుడ్ నటులు, జ్యూరీ సభ్యులతో కలసి దీపికా హల్ చల్ చేసింది. దీపికా నటించిన ’రామ్ లీలా’ చిత్రాన్ని ఈ వేడుక ప్రారంభ వేడుకుల్లో ప్రదర్శించారు. ’రామ్ లీలా’లో రణ్ వీర్ సింగ్ కలసి దీపికా చేసిన రోమాన్స్ కి బాలీవుడ్ నటులు సైతం హాట్స్ ఫ్ చెప్పారట. ఈ చిత్రంలో దీపికా నటకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. ’రామ్ లీలా’ చిత్రానికి రామ్ లీలా బన్సాలీ దర్శకుడు.