కిరణ్ కి రోజులు దగ్గరపడ్డాయ్!

cm kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ వాదులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. తాజాగా, భువనగిరి ఎంపీ రాజగోపాల్‌ రెడ్డి సీయం కిరణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం తన మూడు సంవత్సరాల పాలనలో తెలంగాణకు చేసిందేమిలేదని ఆయన విమర్శించారు. రెండు ప్రాంతాలను వేరుచేసి మాట్లాడి ప్రజల మధ్య వైశమ్యాలను మరింత పెంచారన్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ అధిష్టానం సీఎం పదవి ఇస్తే అధిష్టానాన్ని దిక్కరించి పెద్ద కిరణ్ పోరపాటు చేశారని…. ఆయనకు రోజులు దగ్గరపడ్డాయని రాజగోపాల్ జోస్యం చెప్పారు. కాగా, కిరణ్ సీమాంధ్రకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన నిర్వహించే సమావేశాలకు తెలంగాణ నేతలు హాజరుకావాల్సిన అవసరం లేదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తానికి.. తెలంగాణ ఎంపీలకు ముఖ్యమంత్రి కిరణ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో విభేధాలు వునాయని విషయం స్పష్టమవుతోంది.