విభజన నిర్ణయం తప్పు.. వెనక్కి తెసుకోవాలి : సి.ఎం

kiranఅనంతపురం జిల్లా నార్పల్‌ మండలంలో జరిగిన రచ్చబండలో మరోసారి సీఎం సమైక్య గళాన్ని వినిపించారు. రాష్ట్ర విభజన జరిగితే మిగులు జలాలపై తెలంగాణ ప్రజలు హక్కు కోల్పోతారని సీఎం కిరణ్‌ అన్నారు. సుమారు 96టీఎంసీల మిగులు జలాలను కోల్పోవటంతో పాటు….11లక్షల ఎకరాలకు సాగు నీరు అందకుండా పోతుందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాగానే విభజనతోజరిగే నష్టాలన్నింటికి చర్చించి సమైక్యరాష్ట్రాన్ని నిలబెడతామన్నారు. విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం తప్పని….వెంటనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.