ఎవడు సినిమాకి కష్టాల పరంపర కొనసాగుతోంది. జులై 31న ఈ సినిమా విడుదల కావాల్సింది. అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. కానీ తెలంగాణ ప్రకటన శరాఘూతంలా తగిలింది. అప్పటి నుంచీ ఈసినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. చివరికి డిసెంబరు 19న విడుదల తేదీ ఖరారు చేశారు. ఆ రోజు కూడా ఈ సినిమా రావడం డౌటే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే డిసెంబరు నెలలోనే తెలంగాణపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ సీమాంధ్రలో తప్పకుండా ఉంటుంది. సినిమాల విషయానికొస్తే.. మెగా హీరోల సినిమాల్ని బహిష్కరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవడు సినిమాకి అవరోధాలు తప్పవు. అందుకే… డిసెంబరులో ఈ సినిమా రావడం కష్టమే అని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. సంక్రాంతికి రావాలన్నా కుదరదు. ఎందుకంటే.. పండగ బెర్తులు దాదాపుగా నిండిపోయాయి. ఇప్పుడు మరో సినిమాకి ఛాన్స్ లేదు. మరి ఎవడు…ని అదుకొనేవాడు ఎవడో, అదెప్పుడో చూడాలి..!