ప్రభుదేవా త‌మ్ముడితో..

sushanthక‌రెంట్‌, కాళిదాసు, అడ్డా.. ఇలా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకొంటూనే ఉన్నాడు సుశాంత్‌. అయినా హిట్టు అంద‌నంత దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు మ‌రోసారి భేతాళ ప్రయ‌త్నం మొద‌లెట్టాడు. ఈ చిత్రాన్ని శ్రీ‌నాగ్ కార్పొరేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభుదేవా తమ్ముడు విష్ణుదేవా ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మాతలు. నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రభుదేవా సూపర్ విజన్ లో ఈ చిత్రం సబ్జెక్ట్ తయారైంది. డిసెంబర్ నుంచి షూటింగ్ మొద‌ల‌వుతుంది. అన్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. కణల్ కన్నన్ మాస్టర్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. అని అన్నారు.