హృతిక్ రోషన్ ‘క్రిష్ 3’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీపావళికి కానుకగా వచ్చిన ‘క్రిష్ 3’ అంచనాలను మించేసింది. దాదాపు 150 కోట్ల రూపాయలతో బాలీవుడ్లో తెరకెక్కించిన ఈ మూవీని 3,500 థియేటర్లలో విడుదలైంది. రివ్యూలు కాస్త నెగిటివ్‌గా వచ్చినా.. వసూళ్ల పరంగా 200 కోట్ల మార్క్‌ని తాకినట్లు తెలుస్తోంది. ఇదే దూకుడు కంటిన్యూ అయితే 300 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు లెక్కలు వేస్తున్నాయి..దీంతో చాన్నాళ్లుగా కొనసాగుతున్న ఖాన్ల రికార్డుల త్రయానికి హృతిక్‌రోషన్ రూపంలో చెక్ పడవచ్చని ఇండస్ర్టీలో వాడిగా వేడిగా చర్చించుకుంటున్నారు.ఈ సినిమా 300 కోట్ల కు చేరుకోవటం పెద్ద టాస్క్ కాదని అంచనా.