హ్యాట్రిక్ హిట్ వస్తుందా ?

nithinనితిన్, పూరీలు ‘హార్ట్ ఎటాక్’ స్పీడ్ పెంచారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి బరి నిలపడానికి రెడీ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ను డిసెంబర్ 8న రిలీజ్ చేయడానికి ముహర్తం ఫిక్స్ చేశారు. అనూప్ రూబెన్స్ , నితిన్ లది హిట్ కాంబినేషన్. ఇష్క్, గుండెజారి… చిత్రాల మ్యూజిక్ సూపర్ హిట్. ‘హార్ట్ ఎటాక్’ మ్యూజిక్ కూడా బాగా వచ్చిందట. మ్యూజిక్ పరంగా హ్యాట్రిక్ ఖాయమని టీం చెబుతోంది. మరి ‘హార్ట్ ఎటాక్’ నితిన్ కు హ్యాట్రిక్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.