మరోసారి ధిక్కారం.. !

kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్యరాగాని ఆలపించారు. విశాఖ జిల్లా చోడవరంలోని జడ్పీ స్కూలులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… విభజన వల్ల రాష్ట్రానికి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం పునఃపరిశీలించాలని కోరారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారో స్పష్టం చేయాలని సీఎం అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రి అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించేలా మరోసారి మాట్లాడటం విశేషం. అయితే, విభజన వల్ల సీమాంధ్ర కంటే తెలంగాణకే నష్టం ఎక్కువని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒక వైపు తెలంగాణ వాదులు, మరోవైపు అధిష్టాన పెద్దలు ఎన్ని రకాలుగా మందలించిన కిరణ్ వైఖరిలో మార్పు కాస్త కూడా కనబడకపోవడం గమనార్హం. మరోవైపు, ముఖ్యమంత్రిని మార్చే యోచనలో అధిష్టానం వుందన్న సంకేతాలు కిరణ్ కు చేరాయని.. ఈ నేపథ్యంలోనే ఆయన విభజన అంశాన్ని మరింత గట్టిగా వ్యతిరేకిస్తున్నారని కొంతమంది నేతలు గుసగుసలాడుతున్నారు.