కేటీఆర్ రాజకీయాల్లో బచ్చా: సోమిరెడ్డి

somireddy
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టి.అర్.ఎస్ నేత కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ‘కేటీఆర్.. నువ్వు రాజకీయాల్లో బచ్చా.. మీ నాయిన కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెలుగు దేశం అని తెలుసుకో” అని ఘాటు విమర్శ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యమకారుల మరణాలను కూడా కుటుంబ ప్రయోజనాలకు వాడుకునే మీరా, టీడీపీని విమర్శించేది?’ అని మండిపడ్డారు.

సీమాంధ్ర ఎం.పి లను  ఉద్దేశించి మాట్లాడుతూ… లగడపాటి, ఉండవల్లిలు తమ దగ్గర స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్నాడని చెప్తూ ఉంటారని… మ్యాచ్ మొత్తం ముగిసిన తర్వాత ఆ బ్యాట్స్ మెన్ ఫీల్డులోకి దిగుతాడా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలన్నీ నిజమే అయితే… స్టార్ బ్యాట్స్ మెన్ ను వెంటనే బరిలోకి దించి, విభజన ఆపాలంటూ సవాలు విసిరారు.

కాఫీ తాగడానికి కూడా పది నిమిషాలు పడుతుంది… అలాంటిది విభజనపై పది నిమిషాల్లో మీ వాదనలు చెప్పమని రాజకీయ పార్టీలను బయటకు పంపేశారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా విభజించాలనుకుంటుందో ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.