పది జిల్లాలతో.. ’తెలంగాణ’ : సీపీఐ

cpi narayanacpi ఢిల్లీలో తెలంగాణపై జీవోఎం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నాయి. పదిజిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలతో ఒకేసారి సమావేశం పెడితే బాగుండేదని, ఒక్కొక్క పార్టీని పిలవడం ద్వారా భిన్నాబిప్రాయాలు చెబుతారన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం శాంతిభద్రతలకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని జీవోఎంకు చెప్పినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కమిటీలు వేయాలని సూచించామని నారాయణ పేర్కొన్నారు. మొత్తమ్మీద.. హైదరాబాద్ రాజధానిగా 10జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూనే.. సీమాంధ్ర సమస్యలను సైతం పరిష్కరించలని సీపీఐ సూచించినట్లు సమాచారం.