బాహుబ‌లి కధ ఇదేనా..?

bahubali-movie-first-look-posterబాహుబ‌లిలో రానా ప‌క్కన ప్రణీత న‌టిస్తుందా? ఆమెకు రాజ‌మౌళి ఛాన్స్ ఇచ్చారా? గ‌త కొన్ని రోజులుగా ఈ టాక్ చ‌క్కర్లు కొడుతోంది. ప్రణీత భారీ ఆఫ‌ర్ చేజిక్కించుకొంద‌ని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే అస‌లు నిజం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రణీత లేదు. ఆమాట‌కొస్తే… ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక లేదు. రానా ప‌క్కన హీరోయిన్ ఎవ‌రూ లేరు. క‌థ ప్రకారం.. రానా, ప్రభాస్ ఇద్దరూ స‌వ‌తి సోద‌రులు. వారిద్దరూ అనుష్కనే ప్రేమిస్తారు. అప్పటి నుంచీ ఇద్దరి మ‌ధ్య వైరం పెరుగుతుంది. అదీ క‌థ‌..! అలాంట‌ప్పుడు రానాకి మ‌రో హీరోయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?? ఆర్కామీడియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. 2015 జ‌న‌వ‌రిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.