నితిన్ హిట్ సెంటిమెంట్

nithinవ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నితిన్‌… తొలిసారి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో న‌టిస్తున్నాడు. ఆ చిత్రమే… హార్ట్ ఎటాక్‌. ఆదా శ‌ర్మ క‌థానాయిక‌. ఈ మూవీ టీం ఇటీవలే స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. యూరప్ లో తీసిన దాంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మిగిలి ఉన్న కొంత భాగాన్ని హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ ఈ రోజు నుంచి మొదలైంది.హార్ట్ ఎటాక్ కు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. డిసెంబర్ లో ఆడియో, సంక్రాతికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నితిన్ హిట్ సెంటిమెంట్ నిత్యామీనన్ ‘హార్ట్ ఎటాక్’ లో ఓ గెస్ట్ రోల్ లో కనిపించనుందని టాక్. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.