‘ఓ మై గాడ్’.. మరో రీమేక్

venkatesh in omg‘బోల్ బచ్చన్’ రీమేక్ లో నటించాడు వెంకటేష్. ‘మసాలా’ గా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో హిందీ హిట్ ‘ ఓ మై గాడ్’ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఓ మై గాడ్’ చిత్రం హిందీ లో మంచి విజయాన్ని సాదించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు లోకి తీసుకోస్తారట. ఈ రీమేక్ లో నటించడానికి వెంకీ ఆసక్తి చూపుతున్నారట. ఇటీవల వెంకీ ఆ హిందీ ఒరిజినల్ చూశాడనీ, అందులో అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర బాగా నచ్చడంతో చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ వార్తలు వస్తున్నాయి. పరేష్ రావెల్ పాత్ర లో రాజేంద్రప్రసాద్ ను అనుకుంటున్నారు. నాగ చైతన్య ‘తడాఖా’ దర్శకుడు డాలీ దర్శకత్వం వహించే ఆవకాశం వుంది. మసాలా చిత్రం రీలిజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారీటి రానుంది.