కిరణ్ ను తొలగించరనుకుంటా..!

jc divakar reedyముఖ్యమంత్రిని మారుస్తారన్న ఫీవర్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధిష్టానం సీఎంపై సీరియస్ గా ఆలోచిస్తుంది.. వేటు పడుతుందని బల్ల గుద్దీ చెబుతుంటే.. మరికొందరైతే.. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం వుండదేమోనని వాదిస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఎప్పుడు డిఫెరెంట్ గా స్పందించే జేసీ ఈసారి మాత్రం.. సింపుల్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ముఖ్యమంత్రిని మార్చకపోవచ్చని ఆయన అభిప్రాయడ్డారు. అయితే, ముఖ్యమంత్రి అదిష్టానం మాట వినే అవకాశం ఉందని.. అందువల్ల ఆయన్ను పదవి నుంచి తప్పిస్తారని తాను అనుకోవడం లేదని తెలిపారు. కాగా, ప్రజల కోసమే తాను రాయల తెలంగాణ వాదాన్ని మాట్లాడుతున్నానని జేసీ చెప్పుకొచ్చారు. తన వాదానికి మద్దతు పలుకుతున్న పార్టీలకు ఈ సందర్బంగా జేసీ కృతజ్ఞతలు తెలియజేశారు.