‘లెజెండ్’ లుక్ లీకైయ్యింది !

legend first lookబాలయ్య ‘లెజెండ్’ ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూసే అభిమానులకు ఓ బోనస్. బాలయ్య ‘లెజెండ్’ ఫస్ట్ లుక్ దీపావళి కి వస్తుందని ఎదురుచూశారు అభిమానులు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఫస్ట్ లుక్ ను తలపించే ఓ స్టిల్ ఇప్పుడు నెట్ లో హాల్ చల్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్ లో ఓ అభిమాని క్లిక్ చేసిన ఈ ఫోటో నెట్ లో తెగ తిరిగేస్తుంది. ఈ ఫోటో లో బాలయ్య న్యూలుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై బాలయ్య ఎమోషన్‌గా వున్నాడు. ‘సింహా’ ఫీల్ కనిపిస్తుంది. బాలయ్య ఈ సినిమా కోసం బరువు తగ్గాడని వినిపిచింది. ఈ లుక్ చూస్తే అది నిజమే అని అనిపిస్తుంది.