కాంగ్రెస్ రెండు నివేదికలు !

botsaహస్తం పార్టీలో ఏకాభిప్రాయం కుదర్లేదు. ఇరు ప్రాంత నేతలతో పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ విడివిడిగా చర్చలు జరిపినప్పటికినీ.. అవి ఫలించలేదు. దీంతో.. జీవోఎంకు కాంగ్రెస్ తరపున రెండు నివేదికలు అందనన్నాయి. ఇప్పటికే తెలంగాణ నేతలు నివేదికను సిద్ధం చేశారు. సిద్ధం చేసిన నివేదికను కూడా జీవోఎంకు మెయిల్ చేశారు. దానితో పాటుగా ఓ ప్రతిని పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణకు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ఆలోచన తమకు ఆమోదయోగ్యం కాదని సీమాంధ్ర నేతలు స్పష్టం చేశారు. రెండురోజులుగా పలు దఫాలుగా సమావేశమయిన కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు చివరకు సమైక్యాంధ్ర ఒక్కటే తమ నినాదమని, మరో ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. సమైక్యాంధ్ర కోసం గతంలో చేసిన తీర్మాణ ప్రతిని పీసీసీ ఛీఫ్ బొత్సకు అందించారు. ఇదే విషయాన్ని మంత్రులు శైలజానాథ్‌, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి మీడియా వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం సపరేట్ గా నివేదిక తయారు చేయనప్పటికినీ.. బొత్స కు అందించిన నివేదికలోని అంశాలను జీవోఎంకు ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని వారు బొత్సను కోరినట్లు సమాచారం. మరి ఇప్పటివరకు ప్రతిపక్షాలది రెండు నాల్కల ధోరణి అని విరుచుపడిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇప్పటి కాంగ్రెస్ రెండు నివేదికలపై ఎలా స్పందిస్తారో…!