మ‌హేష్ రిలీజ్ డేట్ చెప్పేశాడు

maheshమ‌హేష్ బాబు – సుకుమార్ క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘1’. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అందిస్తోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న రాబోతోంది. రిలీజ్ డేట్ క‌న్‌పామ్ చేసింది ఎవ‌రో కాదు… స్వ‌యంగా మ‌హేష్ బాబు. సుధీర్ న‌టించిన ఆడు మ‌గాడ్రా బుజ్జీ ఆడియో వేడుక‌కు మ‌హేష్ అతిథిగా విచ్చేసాడు. సాధార‌ణంగా ఇత‌రుల వేడుక‌ల‌లో మ‌హేష్ రాక చాలా త‌క్కువ‌. బావ క‌దా.. అందుకే త‌ప్పలేదు. త‌న ప్రసంగంలో బావ‌ను మెచ్చుకొంటూనే త‌న సినిమా క‌బురూ చెప్పేశాడు. ‘1’ని జ‌న‌వరి 10న రిలీజ్ చేస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి.. అంటూ అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పేశాడు. అంటే వ‌న్ ఈ సంక్రాంతికి రావ‌డం ఖాయ‌మ‌న్నమాట‌.