ఈ కాంబినేష‌న్ వ‌ర్కవుట్ అవుతుందా?

purijaganth kalyanramపూరి జ‌గ‌న్నాథ్ పంథా మార్చారు. స్టార్ హీరోల కోసం ఎదురు చూడ‌కుండా త‌న‌ను వెతుక్కొంటూ వ‌చ్చిన వారితో సినిమాలు చేయ‌డానికి సిద్ధమ‌య్యాడు. నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు పూరి. విష్ణుతో జ‌త క‌ట్టడానికి కూడా ఓకే చెప్పాడు. ఇప్పుడు నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్‌కీ ప‌చ్చ జెండా ఊపేశాడ‌ని స‌మాచార‌మ్‌. ఓమ్ త‌ర‌వాత క‌ల్యాణ్ రామ్ త‌న కొత్త సినిమాని ప్రక‌టించ‌లేదు. కానీ ప్రస్తుతం ఆ ప‌నుల్లోనే ఉన్నార‌ని స‌మాచార‌మ్‌. క‌త్తి ద‌ర్శకుడు మ‌ల్లికార్జున్‌తో ఆయన ఓ సినిమా చేస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. అయితే కొత్త ద‌ర్శకుడికి అవ‌కాశం ఇవ్వడం కంటే సీనియారిటీని న‌మ్ముకోవ‌డ‌మే మేల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే పూరితో జ‌త‌క‌డుతున్నట్టు స‌మాచార‌మ్‌. పూరి ప్రస్తుతం హార్ట్ ఎటాక్ సినిమా ప‌నుల్లో ఉన్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ నాటికి పూర్తవుతుంది. ఆ త‌ర‌వాతే క‌ల్యాణ్ రామ్ సినిమా సంగ‌తులు తెలిసే అవ‌కాశాలున్నాయి.