వెటెల్ హ్యాట్రిక్

Sebastian Vettel wins Indian GPజర్మన్ రేస్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మరో సారి కదంతొక్కాడు. కారును జర్మన్ గుర్రం లా పరిగెత్తించి గెలుపు గుర్రం గా నిలిచాడు. గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో నేడు జరిగిన మెయిన్ రేసులో వెటెల్ డ్రైవర్స్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోజ్ బెర్గ్ ను 30 సెకన్ల తేడాతో వెనక్కినెట్టి వెటెల్ పోడియం ఫినిష్ సాధించాడు. వెటెల్ రెడ్ బుల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్ లో 2011 నుంచి ఈ ఫార్ములా వన్ రేసు నిర్వహిస్తుండగా..వరుసగా మూడు పర్యాయాలూ వెటెల్ చాంపియన్ గా నిలిచి హ్యాట్రిక్ సాదించాడు.