దీపావ‌ళికి ఫస్ట్ లుక్‌..?

balayyaనంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం లెజెండ్‌. బోయ‌పాటి శ్రీ‌ను దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. సోనాలీ చౌహాన్‌, రాధికా ఆప్టే క‌థానాయిక‌లు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. లెజెండ్ ఫ‌స్ట్ లుక్‌ని దీపావ‌ళికి విడుద‌ల చేస్తార‌ని స‌మాచార‌మ్‌. నిజానికి ద‌స‌రాకే లెజెండ్ తొలి చిత్రాన్ని చూపిద్దామ‌నుకొన్నారు. కానీ కుద‌ర్లేదు. దీపావ‌ళి సంద‌ర్భంగా లెజెండ్ ఫ‌స్ట్ లుక్ దించేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. ఇది మూడు త‌రాల క‌థ‌. బాల‌య్య గెట‌ప్ సూప‌ర్బ్‌గా కుదిరింద‌ని చిత్ర బృందం చెబుతోంది. సింహాలో బాల‌య్య బాబును మ‌రింత అందంగా చూపించాడు బోయ‌పాటి. మ‌రి లెజెండ్‌గా ఆయ‌న‌కు ఇంకెన్ని వ‌న్నెలు అద్దుతాడో..?