యూటీ చేయడం కుదురదు !

digvijayహైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం సాధ్యంకాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనపై ఎవరితోను చర్చించలేదని ఆయన అన్నారు. ఈరోజు (మంగళవారం) దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పై తాము చర్చిస్తున్నామన్నారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వెళ్తుందా లేదా ఇప్పుడే తాను చెప్పలేనని స్పష్టం చేశారు. తీర్మానంపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో చర్చించామని, రాజ్యాంగబద్దంగా కొత్త రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాస్తవాన్ని అర్ధం చేసుకొని, రాజీనామాలు ఉపసంహరించుకోవాలని డిగ్గీరాజా కోరారు. హైకమాండ్ నిర్ణయాన్ని అడుగడుగునా.. ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడని ఢిగ్గీరాజా వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు, కేంద్ర మంత్రి జేడీ శీలం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.