నాగ్ కూడా త‌గ్గడం లేదు

Nagarjuna-Bhaiఎన్ని రోజులు సినిమా ఆడింది? అనే విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్ని ఎక్కువ సెంట‌ర్లలో విడుద‌ల చేశాం…? ఎన్ని త‌క్కువరోజుల్లో ఎన్ని డ‌బ్బులు దండుకొన్నాం అనే చూస్తున్నారు. అందుకే.. ఎక్కువ ప్రింట్లతో సినిమాని విడుద‌ల చేస్తున్నారు. పెద్ద సినిమా అన‌గానే 1000 స్ర్కీన్‌లు త‌గ్గడం లేదు. మొన్న రామ‌య్యా వ‌స్తావ‌య్యా 1200 స్ర్కీన్‌ల‌లో విడుద‌ల చేశారు. ఇప్పుడు భాయ్‌.. నాగార్జున కూడా త‌గ్గడం లేదు. అక్కినేని నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం భాయ్‌. వీర‌భ‌ద్రమ్ ద‌ర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెర‌కెక్కించింది. ఈనెల 25న భాయ్ విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 1000 స్ర్కీన్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. నాగ్ కెరీర్‌లో ఇదే రికార్డ్‌! నైజాం, వైజాగ్‌ల‌లో నాగ్ ఈ చిత్రాన్ని సొంతంగా విడుద‌ల చేస్తున్నార‌ట‌.