కిరణ్ తుఫాన్ – దిగ్గీరాజా చిరునవ్వు !

Digvijay_Singhముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన తుపాను ఆపుతానన్న ప్రకటనపై పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ చిరునవ్వే సమాధానం అయింది. తాజాగా, డిగ్గీరాజా విలేకరులతో మాట్లాడుతూ.. రాజీనామాలపై సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తొందర పడొద్దని సూచించారు. విభజనపై పునరాలోచన లేకున్నా… సీమాంధ్రకు పూర్తి స్థాయి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంద్ర నేతలంతా అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారని, ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత వారు వెనక్కి వెళ్లడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంద్ర నేతలకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అయినా, తమ ప్రాంతానికి అవసరమైన మంచి ప్యాకేజీ, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వారి ప్రతిపాదనలను మంత్రుల బృందానికి ఇవ్వాలని అన్నారు. తెలంగాణపై అసెంబ్లీ తీర్మానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన వివరించారు. దీనికి సంబంధించి త్వరలోనే తాను హోంమంత్రి షిండేను కలుస్తానని డిగ్గీ చెప్పారు.