యంగ్‌లుక్‌లో బాల‌య్య‌…

balayyaరూల‌ర్ కోసం పెద్ద ఎత్తున క‌సరత్తులు చేస్తున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సింహా సినిమాలో బాల‌య్యని చాలా అందంగా చూపించారు బోయ‌పాటి శ్రీ‌ను. ఈసారి ఇంకాస్త కొత్తగా చూపించే ప్రయ‌త్నాల్లో ఉన్నారు. అందుకే బాల‌కృష్ణ ఈ సినిమా కోసం భారీ క‌స‌ర‌త్తులు చేశార‌ట‌. చాలా స్లిమ్ అయ్యార‌ట‌. దాదాపుగా 6 కిలోల బ‌రువు త‌గ్గార‌ట‌. బాల‌య్య లుక్ పూర్తిగా మారిపోయింద‌ట‌. ఈ సినిమాలో బాల‌కృష్ణ గెట‌ప్ చాలా ఫ్రెష్ గా ఉండ‌బోతోంద‌ని స‌మాచార‌మ్‌. అయితే బాల‌య్య గెట‌ప్ కి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు చెప్పడం లేదు. ఆయ‌న పాత్రకు సంబంధించిన వివ‌రాలు గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తానికి చాలాకాలం త‌ర‌వాత బాల‌య్య యంగ్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌న్నమాట‌. ఇది నంద‌మూరి అభిమానుల‌కు శుభ‌వార్తే.