ప్యార్ మే ప‌డిపోయామే…

aadi shanviలవ్లీ జంట ఆది, శాన్వి లు మ‌రోసారి తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. ప్రేమ ప‌క్షులుగా మురిపించ‌బోతున్నారు. సామాన్యుడు, శ్రీ‌మ‌న్నారాయ‌ణ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న ర‌వికుమార్ చావ‌లి ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. కె.కె.రాధామోహ‌న్ నిర్మాత‌. ద‌స‌రా సంద‌ర్భంగా సోమ‌వారం చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి ప్యార్‌మే ప‌డిపోయానే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన పోటుగాడు సినిమాలో బాగా పాపుల‌ర్ అయిన పాట ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టేశారు. ”ప్రేమ, వినోదం క‌ల‌బోత‌గా సాగే సినిమా ఇది. యాక్షన్ ఘ‌ట్టాలూ ఉంటాయి. న‌వంబ‌రు రెండోవారం నుంచీ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తాం” అని చిత్రబృందం చెబుతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.