సుకుమార్ సెకండ్ హీరో దొరికేశాడు

sukumarక్రియేటీవ్ ద‌ర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు సుకుమార్‌. ప్రస్తుతం మ‌హేష్ బాబుతో `1` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా నిర్మాత‌గానూ బిజీ అవుతున్నారు. సుకుమార్ నిర్మాత‌గా మారి… త‌న శిష్యుల‌ను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. సుమంత్ అశ్విన్ క‌థానాయ‌కుడిగా ఆయ‌నో చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఇప్పుడు ఆయ‌న రెండో సినిమాకి హీరో దొరికేశాడు. ఆయ‌నే విక్రమ్‌. విక్రమ్ అంటే త‌మిళ హీరో విక్రమ్ కాదు.. త‌న ద‌గ్గర అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ఓ ద‌ర్శకుడు. అత‌నిలో హీరో అయ్యే క్వాలిటీస్‌ని గుర్తించిన సుకుమార్‌.. కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకి ద‌ర్శకుడు ఎవ‌ర‌నేది ఇంకొన్ని రోజుల్లో తెలియ‌నుంది. మొత్తానికి అటు ద‌ర్శకుడిగానే కాకుండా.. నిర్మాత‌గానూ జోరుమీదున్నాడన్నమాట‌. ఆల్ ది బెస్ట్‌.. సుక్కూ..