ప‌వ‌న్ తో క‌రీనా క‌పూర్‌?

pavankareenaగ‌బ్బర్ సింగ్ 2లో క‌థానాయిక ఎవ‌రనే సంగ‌తి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో ప్రణీత క‌థానాయిక‌గా ఖాయ‌మైపోయింది అంటున్నా… ప్రణీత‌కు అంత సీన్ లేద‌ని మ‌రో వ‌ర్గం గ‌ట్టిగా వాదిస్తోంది. ప‌వ‌న్ ఇమేజ్‌కి స‌రితూగే క‌థానాయిక ఈ సినిమాకి కావాల‌ని చిత్రబృందం కూడా గ‌త కొంత‌కాలంగా గ‌ట్టిగానే ప్రయ‌త్నాలు సాగిస్తోంది. సోనాక్షి సిన్హా, దీపికా ప‌దుకొణే పేర్లు ప‌రిశీలించారు. ఇప్పుడు క‌రీనా క‌పూర్ కూడా రేసులోకి వ‌చ్చింది. ప‌వ‌న్ ప‌క్కన క‌రీనా అయితే బాగుంటుంద‌ని సంప‌త్ నంది భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌కు ముంబై క‌థానాయ‌కులతో మంచి సంబంధాలున్నాయి. ఎందుకంటే కొంత‌కాలం అక్కడ యాడ్ ఏజెన్సీ నిర్వ‌హించారు సంప‌త్‌. ఆ ప‌రిచ‌యాల‌తోనే క‌రీనాను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నార‌ట‌. ప‌వ‌న్ – క‌రీనా.. కాంబినేష‌న్ అదిరిపోతుంది క‌దూ. మ‌రి ఈ క‌ల‌యిక నిజ‌మ‌య్యేది ఎప్పుడో..?