సమ్మె విరమించేనా.. ?

Untitled-3సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర చీకటిమయం అవడమే గాక, రైల్వే శాఖ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. దీంతో.. ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సమ్మెను విరమించి వెంటనే విధుల్లోకి చేరి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించమని సీఎం విద్యుత్ ఉద్యోగులను కోరనున్నట్టు సమాచారం. అయితే, సీఎం సూచనను ఉద్యోగులు పాటించి.. సమ్మెను విరమిస్తా… ? లేదా అన్నది వేచి చూడాలి. అయితే, ముఖ్యమంత్రి స్థాయిలో అయితేనే.. చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుంటుందని ఏపీ ఎన్జీవోలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా.. ఏపీ ఎన్జీవోల సమ్మెకు ముఖ్యమంత్రే నాయకత్వం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో.. సీఎంతో చర్చల అనంతారం విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించే అవకాశం వున్నట్లు విశ్లేషకులు బావిస్తున్నారు.