పవన్ కల్యాణ్.. నితిన్‌కి బాగా కలిసొస్తున్నాడు. నితిన్ పవన్‌కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్‌ని తన ఇష్క్ ఆడియో వేడుకకు పిలిపించి.. ఆ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చాడు. గుండెజారి గల్లంతయ్యిందేలో పవన్ పాటని రీమిక్స్ చేశాడు. అదీ హిట్టే. ఇప్పుడు పవన్ వల్ల కోట్లు సంపాదించాడు. అదెలాగంటే… అత్తారింటికి దారేది సినిమా నైజాం రైట్స్ నితిన్ డాడీ.. సుధాకర్‌రెడ్డి దక్కించుకొన్నారు. ఈ సినిమాని నైజాం రైట్స్ ఫ్యాన్సీ రేటుకి చేజిక్కించుకొన్నారు. ఇప్పుడు నైజాంలో ఈ సినిమా దుమ్ము రేపుతోంది. తొలి వారంలోనే డబ్బులన్నీ తిరిగొచ్చాశాయ్. కనీసం అత్తారింటికి దారేది వల్ల నితిన్‌కి.. రూ.4 కోట్లు మిగిలే అవకాశం ఉందట. సో… లక్కీ కదూ..!