మ‌ళ్లీ.. పోలీస్‌గా!!

mahesh-babu-police-picsపోకిరిలో అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించి థ్రిల్ క‌లిగించాడు.. మ‌హేష్‌బాబు. దూకుడులోనూ ఖాకీ క‌ట్టాడు. ఈ రెండు సినిమాలూ హిట్టే! ఆ సెంటిమెంట్‌తోనే ముచ్చట‌గా మూడోసారి పోలీస్ దుస్తుల్లో మెరిసిపోవ‌డానికి సిద్ధమ‌వుతున్నాడు మ‌హేష్‌బాబు. శ్రీ‌నువైట్ల ద‌ర్శకత్వం వ‌హించే చిత్రం ఆగ‌డు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ సినిమాలోనూ మ‌హేష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తార‌ని స‌మాచార‌మ్‌. స్ర్కిప్టు ఇప్పటికే సిద్ధమైంది. ఈ ద‌స‌రాకి ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.