కమల్, రజనీకాంత్.. నటులుగా భిన్న దృవాలు. ఏమైన సౌత్ నుంచి వాల్ద్ వైడ్ గుర్తింపు వున్న నటులు వీరిద్దరు. అయితే ఇద్దరు ఇంచు మించుగా ఒకెసారి కెరీర్ ప్రారంభించి సమాంతరంగా ఎవరి స్టైల్లో వాళ్లు సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఇక రెమ్యున్ రేషన్ పరంగా రజనీకాంత్ ఆసియాలో జాకిచన్ తరువాత ఎక్కువ పారితోషకం తీసుకుంటున్ నటుడిగా పేరుంది. అలాగే కమల్ కు ఇంత అని చెప్పలేం కానీ.. ఆయన ఫీజు కూడా తక్కువేమి కాదు. కొంచెం అటు ఇటు గా అంతే వుంటడనడంలో సందేహాం లేదు మరి.
ఇక అసలు విషయం ఏమిటంటే.. ఇప్పుడంటే ఈ స్టార్ట్ ఇద్దరు రెమ్యునే రేషన్ ఈ రేంజ్ లో ఉంది కానీ.. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరు పలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి..ఒకరి పై మరొకరికి ఉన్న అభిమానం చాటుకున్నారు. ఈ వరసలోనే దాదాపు 36 సంవత్సరాల క్రితం వీరిద్దరు కలసి 16 వయాధినిలే అనే ఒక సినిమాలో నటించారు. భారతీరాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు డిజిటిల్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల శనివారం మద్రాసులో జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ పాల్గొన్నారు. అయితే డైరెక్టర్ భారతీరాజా ఈసినిమాకు కమల్ , రజనీకాంత్ లు తీసుకున్న రెమ్యున్ రేషన్స్ గుర్తు చేసుకున్నారు. కమల్ 27 వేలుకు ఇస్తే.. రజనీకాంత్ కు 25 వేలు ఇచ్చారట. అయితే రెమ్యున్ రేషన్ విషయం..స్టార్ డమ్ .. వంటి విషయాలు రజనీకాంత్ స్వభావాన్ని ప్రభావితం చేయలేకపోయాయని ప్రశంసించారు. అంటే 25 వేలు తీసుకున్న రజనీకాంత్ ఎలా వున్నాడో.. సినిమాకు 25 కోట్ల కు పైగా తీసుకుంటున్న రజనీకాంత్ అలాగే ఉన్నడని గుర్తు చేసుకున్నారు. అందుకే గా కొట్లాది మంది ఆయనకు అభిమాన గణం బయలు దేరింది.ఇక రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్ ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 12న విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.