ఆడిపిల్లలు లేకుండా ఈ క్రియేషన్ ను ఊహించండి .మాకు అయితే ఊహించడమే కష్టంగా ఉంది. అమ్మ, అక్క, చెల్లి , భార్య, స్నేహితురాలు లేకుండా మానవ సంబంధాల్ని ఊహించండి. టెర్రిబుల్ అనిపించడంలా..! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆడిపల్ల లేకపోతే ఈ సృష్టే కి అర్దం పరమార్ధం ఉండదు. ఇదేంటి సడన్ గా ఆడ శిషు సంరక్షణ గురించి వ్యాసం మొదలెట్టారు అనుకుంటున్నారా.? అదేమి లేదులేండి.. సల్లుభాయ్ గురించి ఇదంతా…!
సల్లుబాయ్ కి ఆడ పిల్లలంటనే చాల ఇష్టమట. తనకు ఇద్దరు చెల్లెలు ఉన్నారట. అనుబంధాలకు వాళ్లేచే ప్రాధాన్యత తనను ఎంతో్ సంతోషానికి గురి చేస్తుందంటున్నాడు.అంతే కాదు.. అసలు ఆడ పిల్లలు లేకుండా ఈ సృష్టిని తలచుకుంటే భయం వేస్తుందంటూ..అందుకే ఆడ పిల్లల పట్ల వివక్ష చూపడం సరికాదంటూ గళం విప్పారు. ఆడపిల్లను పెంచడం కష్టమనో.. ఇతరత్రా కారాణాల వల్ల .. భయపడి.. గర్భంలోనే ఆడ పిల్లను చంపడం అ మానవీయం అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.. ముంబైలో జరిగిన ఓ మహిళ సంక్షేమ కార్యక్రమంలో సల్మాన్ అతిథిగా పాల్గొని తన మనసులో భావాల్ని ఇలా పంచుకున్నారు. తనకు పెళ్లి అయిన తరువాత అంత ఆడపిల్లలే పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటానని తన మనసులో మాట చెప్పారు. అంతే బాగానే ఉంది.. వయసు రీత్య ఆఫ్ సెంచరీకి దగ్గరవుతున్నా ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు.. ! ఇక పిల్లల్ని కనేది ఎప్పుడో కదా.!