జంజీర్‌తో బాలీవుని భయపెట్టేశాడు రామ్‌చరణ్. ఆ తరవాత అక్కడి నుంచి అవకాశాలేం రాలేదు. అందులో న్యాయం ఉంది లెండి. ఇక్కడ సూపర్ స్టార్ కొడుకైనా.. ఆ రిజర్వేషన్ బాలీవుడ్లో లేదు కదా?? అయితే సల్మాన్ మాత్రం రామ్‌చరణ్‌తో సినిమా చేయడానికి తెగ ఉవ్విళ్లూరుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మద్య మంచి స్నేహం ఉందని, అందుకే ఈ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని, దానికి ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని… గాసిప్పులు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు ఎవరు?? ఈ సినిమా ఎప్పుడు మొదలెడతారు?? అనే విషయాలపై స్పష్టమైన సమాచారం లేదు. రామ్‌చరణ్ తో సల్మాన్ అంత రిస్క్ చేస్తాడా?? అదంతా ఒట్టిదే అనేది విశ్లేషకుల మాట. సల్మాన్ పేరు చెప్పి తానే ఓ సినిమా తీస్తున్నాడని మరో వర్గం చెబుతోంది. ఇందులో నిజానిజాలు ఎలావున్నా చరణ్ బాలీవుడ్లో మరో సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నాడనేది మాత్రం వాస్తవం. మరి ఈసారైనా టార్గెట్ ఛేజ్ చేస్తాడా??