ప‌వ‌న్‌కి హెల్ప్ చేస్తున్న ఎన్టీఆర్‌??

pavan-ntrరామ‌య్యా వ‌స్తావ‌య్యా విడుద‌ల తేదీ ఇంకా ఊగిస‌లాడుతోంది. ఈ సినిమా ద‌స‌రాకి వ‌స్తుందా? రాదా? అనే సందేహాలు ఇంకా తీరలేదు. ఈ సినిమా విడుదల తేదీ పై నిర్మాత దిల్ రాజు కూడా ఓ స్పష్టమైన ప్రక‌ట‌న చేయ‌లేదు. ద‌స‌రాకి రాక‌పోతే… దిల్‌రాజుకి మాత్రం న‌ష్టమే. రామ‌య్య రాక‌పోతే లాభ‌ప‌డేవాళ్లు ఎవ‌రైనా ఉన్నారంటే అది ప‌వ‌న్ క‌ల్యాణే. ఎలాగంటే.. రామ‌య్య రాకపోతే ఈ ద‌స‌రాకి థియేట‌ర్ల ద‌గ్గర సంద‌డేమీ ఉండ‌దు. ఉన్నద‌ల్లా అత్తారింటికి దారేది సినిమానే. సీమాంధ్రలో మార్నింగ్ షోలు ఎలాగూ ప‌డడం లేదు. ఫ‌స్ట్ షో, సెకండ్ షో మాత్రమే. అత్తారింటికి దారేది.. సినిమా ఇప్పటికీ అక్కడ జోరుగానే న‌డుస్తోంది. ద‌స‌రాకి రామ‌య్య రాక‌పోతే మ‌రో ఆప్షన్ ఉండ‌దు. వాళ్లంతా మ‌ళ్లీ.. అత్తారింటికి దారేది సినిమాకే వెళ్లాలి. రోజుకి రెండు షోలైనా చాలు. రికార్డులు కుమ్ముకోవ‌డానికి. అలా ఎన్టీఆర్ కూడా ప‌వ‌న్‌కి హెల్ప్ చేస్తున్నాడ‌న్నమాట‌.