టీ-నోట్ పై సస్పెన్స్

cwcతెలంగాణ నోట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఈరోజు సాయంత్రం జరగబోయే కేబినేట్ ముందుకు టీ-నోట్ వస్తుందా.. ? రాదా..? అనే ఉత్కంఠ నెలకొంది. కేబినేట్ ముందుకు టీ-నోట్ రాబోతుందన్న వార్తలతో ఇప్పటికే సీమాంధ్ర భగ్గుమనగా, మరోవైపు తెలంగాణ నేతలు మాత్రం టీ-నోట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం నుంచి తెలంగాణ నోట్ కేబినేట్ ముందుకు రాబోతుందన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే టీ-నోట్ పై వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని చెప్పేశారు. దీంతో.. టీ-నోట్ పై సర్వత్రా సస్పెన్షన్ నెలకొంది. అసలు టీ-నోట్ రెడీ అయిందా.. ? రెడీ అయితే ఈరోజు జరిగే కేబినేట్ ముందుకు నోట్ వస్తుందా.. ? రాదా..? అనే విషయాల్లో స్పష్టత లేదు. మరోవైపు ఆంటోని కమిటీ నివేదిక వచ్చే వరకు టీ-నోట్ కేబినేట్ ముందుకు రాదని.. అందుకు ఇంకొంత కాలం పట్టవచ్చని జాతీయ ఛానల్ పిటీఐ గత రెండు రోజుల ముందు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం బాగా హీటేక్కాయి. టీ-నోట్ పై వచ్చిన వార్తల నేపథ్యంలో సీమాంధ్ర నేతలు హుఠాహుఠిన సమావేశమయి భవిష్యత్ కార్యచరణపై దృష్టి పెట్టారు. అసలు టీ-నోట్ పై సస్పెన్షన్ వీడేదెన్నడూ.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేది ఎప్పుడనని సామాన్య మానవుడు ఊసురుమంటున్నాడు.