రీమేక్ రైట్స్ ఎవ‌రికి ద‌క్కేనో..?

attarintiki-darediయావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ దృష్టి… అత్తారింటికి దారేదిపైనే ఉంది. తెలుగులో ఈ సినిమా సాధిస్తున్న విజ‌యాన్ని, వ‌సూళ్లనీ ఓ కంట క‌నిపెడుతూనే ఉంది. తమిళ తంబీలూ, హిందీ ద‌ర్శకులు ఈ సినిమాని అర్జెంటుగా రీమేక్ చేసేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కూ త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన సినిమాల్ని ప‌వ‌న్ తెలుగులో రీమేక్‌లు చేసి హిట్లు కొట్టాడు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమా అత్తారింటికి దారేది త‌మింలో విజ‌య్‌తో తెర‌కెక్కించాల‌ని కొంత‌మంది నిర్మాత‌లు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ రీమేక్ రైట్స్ కోసం బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి భారీ మొత్తం ఆఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచార‌మ్‌. అయితే బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇంకా త‌న నిర్ణయాన్ని ప్రక‌టించ‌లేదు. అంతేకాదు.. బాలీవుడ్ దృష్టి కూడా అత్తారింటికిపై ప‌డింది. ద‌క్షిణాదిన సినిమాల్ని ఎప్పుడెప్పుడు హిందీలోకి తీసుకెళ్లిపోదామా..? అనుకొనే నిర్మాత‌లంతా ఇప్పుడు అత్తారింటికి రైట్స్ కోసం పోటీ ప‌డుతున్నారు. మ‌రి ఈ విష‌యంలో ప‌వన్ సినిమా ఎవ‌రి రికార్డును బ‌ద్దలు కొడుతుందో చూడాలి.