విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం దూసుకెళ్తా. వీరూ పోట్ల దర్శకుడు. ఈ చిత్రానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. విష్ణు పరిచయ సన్నివేశాల్లో తెర వెనుక నుంచి రవితేజ గొంతు వినిపిస్తుంది. “ఈ సినిమాలో విష్ణు పరిచయ సన్నివేశాల్ని కాస్త వైవిధ్యంగా తెరకెక్కించాం. ఓ అల్లరి గొంతుతో విష్ణు పాత్ర చిత్రణని వివరిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే రవితేజను సంప్రదించాం. అడిగిన వెంటనే ఆయన ఒప్పుకొన్నారు. రవితేజకి చాలా థాంక్స్..“ అని దర్శకుడు వీరు పోట్ల చెబుతున్నారు. రవితేజ గాత్రదానం చేయడం ఇది రెండోసారి. అంతకు ముందు మర్యాద రామన్నలో సునీల్ తొక్కే సైకిల్ కి వాయిస్ ఓవర్ చెప్పారు రవితేజ. ఆ సినిమా సూపర్ హిట్. మరి దూసుకెళ్తా ఏమవుతుందో..? ఈనెల 11న దూసుకెళ్తా ప్రేక్షకుల ముందుకు రానుంది.