సత్తిబాబు మార్క్ రాజకీయం !

botsaపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన మార్క్ రాజకీయానికి తెరలేపారు. ఆంటోని కమిటీని రాష్ట్రానికి రావాలని రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు లేఖ రాయడం.. దానికి బదులుగా దిగ్విజయ్ ఢిల్లీకి రండీ మాట్లాకుందామని ఆహ్వానించడం చూస్తుంటే.. సత్తి బాబు మాంఛి స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. ఈరోజు సత్తిబాబు హస్తినాకు బయలుదేరనుండగా.. అంతకు ముందుగానే అందుబాటులో వున్న సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మిగితా ప్రజాప్రతినిద్థులతో సమావేశం కానున్నారు. సత్తి బాబు ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకటి ఆంటోని కమిటీని రాష్ట్రానికి రప్పించడం. రెండది.. ఎవరికి వారు కాకుండా అవసరమైతే.. సీమాంధ్ర ప్రజప్రతినిధులంతా ఒకేసారి మూకుమ్మడి రాజీనామాలు చేయడం. మొదటి ప్లాన్ అమలైనా.. రెండో ప్లాన్ వర్కవుట్ అయినా.. సత్తి బాబు సీమాంధ్రలో హీరో అయినట్లు కనిపిస్తోంది. ఒకవేళ మూకుమ్మడి రాజీనామాల వల్ల విభజన ప్రక్రియ మరింత సులభతరమైనా.. కూడా అధిష్టానం దృష్టిలో సత్తిబాబు సూపర్ మ్యాన్ గా పేరొందే అవకాశాలే ఎక్కువ. సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్ మెన్ గా ముఖ్యమంత్రి కిరణ్ దూసుకెళుతున్న సమయంలో.. చూస్తూ ఊరుకుంటే బాగుండదనుకున్నారో ఏమో సత్తిబాబు.. తన మార్క్ రాజకీయాలకు తెరలేపారు.