సునీల్ వెనుక ప‌డిన షాడో

meher-ramesh-sunilమిస్టర్ పెళ్లికొడుకుతో పెద్ద ఝ‌ల‌క్ త‌గిలింది సునీల్‌కి. అందుకే కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే అందులో కొన్ని ఆశ్చర్యక‌ర‌మైన నిర్ణయాలూ ఉన్నాయి. త‌నికెళ్ల భ‌ర‌ణితో క‌న్నప్ప సినిమా చేస్తున్నాడు సునీల్. బీసీ సెంట‌ర్ల ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకొనే స‌త్తా ఉన్న సునీల్‌.. క‌న్నప్పగా భ‌క్తి భావాల‌ను పంచగ‌ల‌డా?? అనేది పెద్ద డౌటు. ఇప్పుడు మ‌రో షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మెహ‌ర్ ర‌మేష్‌తో జ‌త క‌ట్టబోతున్నాడ‌ట‌. షాడో త‌ర‌వాత మెహ‌ర్ ర‌మేష్ మ‌రో సినిమా ఏదీ చేయ‌లేదు. క‌నీసం సినిమా చేస్తాడ‌న్న ప్రచారం కూడా జ‌ర‌గ‌లేదు. కానీ స‌డ‌న్‌గా ఇప్పుడు మెహ‌ర్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాత‌గా వ్యవహ‌రిస్తార‌ని స‌మాచార‌మ్‌. మ‌రి ఫ్లాపుల్లో ఉన్న మెహ‌ర్ ఈ సారైనా హిట్ కొడ‌తాడో లేడో చూడాలి.