సారీ… పోలీస్ బాస్ !

DGP Dinesh reddy commentsరాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డికి చుక్కెదురైంది. తన పదవి కాలాన్ని పొడగించాలంటూ.. దినేష్ రెడ్డి క్యాట్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, డీజీపీ పదవీకాలాన్ని పొడిగించలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు క్యాట్ కు ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించనుంది. ఈ నెలాఖరున డీజీపీ పదవి కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఆయన నియమాకాన్ని పొడగించాలా.. ? వద్దా.. ? అనే విషయమై రేపు క్యాట్ స్పష్టం చేయనుంది. అయితే, ప్రభుత్వం సిఫారుసు మేరకు దినేష్ రెడ్డి పదవి కాలాన్నిక్యాట్ పొడగించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. కాగా, దినేష్ స్థానంలో.. ప్రభుత్వం తదుపరి పోలీస్ బాస్ గా ప్రసాద్ రావుకు నియమించే అవకాశం వున్నట్లు సమాచారం.