రికార్డు బాదుడు

otagoచాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ లో అత్యధిక స్కోర్ నమోదయింది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది ఒటాగో వోల్ట్స్ జట్టు. పెర్త్ స్కార్చర్స్ తో జైపూర్లో జరుగుతున్న మ్యాచ్ లోమొదట బ్యాటింగ్ చేసిన ఒటాగో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 242 పరుగులు చేసింది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఈ రికార్డు ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( 215 పరుగులు) పేరిట ఉండేది.