ప్లీజ్ .. సమ్మెను విరమించండి

digvijaysigతెలంగాణ పై హోంశాఖ ముసాయిదా తయారుచేస్తోందని, కేబినెట్ నోట్ తయారైన తర్వాత అసెంబ్లీకి పంపిస్తామని తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. ఈరోజు ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో జరిగిన భేటీ అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. సీమాంధ్రలో సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… ఏపీ ఎన్జీవోలు తక్షణమే సమ్మె విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రయివేట్ దుకాణాలు, రవాణా వ్యవస్థ, కార్యాలయాలు నడుస్తుంటే…. ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచటం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఎదురయ్యే అన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇక జగన్ బెయిల్ పై కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లాలూచీ పడ్డాయన్న టీడీపీ వ్యాఖ్యలను దిగ్విజయ్ ఖండించారు.