28న దూసుకెళ్తా ఆడియో

doosukelthaమంచు విష్ణు హీరో గా బిందాస్‌, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దూసుకెళ్తా’. అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి కథానాయిక. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌ పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. విజయ దశమి కానుక గా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేస్తున్నారు. మణిశర్మ అందించని ఈ చిత్రం గీతాలను ఈ నెల 28న పార్క్ హయత్ హోటల్ విడుదల చేస్తున్నారు. విష్ణు కెరీర్ లో చెప్పుకోదగ్గ… రెడీ, ‘దేనికైనా రెడీ’ రెండు చిత్రాలు కూడా కామెడి మిక్స్ చేసిన యాక్షన్ చిత్రాలే. ఈసారి కూడా విష్ణు ఇదే ఫార్ములా ను నమ్ముకున్నాడు. మనోజ్ కు బిందాస్ లాంటి మంచి హిట్ అందిచిన దర్శకుడు వీరూ పోట్ల, విష్ణు కు ఎలాంటి విజయం అందిస్తాడో చూడాలి.