సీమాంధ్ర బంద్ !

Seemandhraరాష్ట్ర విభజనకు నిరసనగా ఈరోజు (మంగళవారం) సీమాంధ్ర జిల్లాల్లో బంద్ పాటిస్తున్నారు. ఈ నెల 16న ప్రకటించిన కార్యాచరణలో భాగంగా నేడు సీమాంధ్ర జిల్లాల్లో రహదారులను దిగ్భందం చేయనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను సరిహద్దుల్లో నిలిపివేయనున్నట్టు తెలిపారు. దీంతో.. ఉద్యమ సెగ ఢిల్లీకి తాకే అవకాశం వున్నట్లు ఉద్యమ కారులు భావిస్తున్నారు. సమైక్య సెగ తిరుపతికి తప్పడం లేదు. తిరుపతిలో ట్యాక్సీలు, ఆటోలతో పాటుగా కొండపైకి వెళ్లే వాహనాలను ఉద్యమ కారులు అడ్డుకున్నారు. మరోవైపు, సీమాంధ్ర ఎంపీలు నేడు స్వీకర్ ను కలసి రాజీనామాలు అందజేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంట్లో.. భాగంగానే ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయి.. చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.