జనంలోకి జగన్ !

jaganగత 16నెలలుగా జైల్లో వున్న జగన్ రేపు జనంలోకి రానున్నారు. నాంపల్లి సీబీఐ కోర్టు ఈరోజు (సోమవారం) జగన్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండు లక్షల రూపాయలు, ఇద్దరు  పూచికత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ పది ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 71మందిని నిందితులను పేర్కొంది. దాదాపు 484రోజులు చంచల్ గూడ జైలులో వున్నజగన్ ఇప్పటి వరకు ఆరుసార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా, ఏడో బెయిల్ పిటిషన్ కు జగన్ కు బెయిల్ మంజూరైంది. రేపు ఉదయం జగన్ జనంలోకి రానున్నారు. దీంతో.. వైకాపా శ్రేణులు ఆనందంతో మునిగితేలుతున్నారు. అయితే, జగన్ కు బెయిల్ రావడంతో.. రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం వున్నట్లు సమాచారం.