మహిళలకు మరింత ప్రాధాన్యం : షిండే

Shinde1గత మూడేళ్లుగా దేశంలో మహిళలపై నేరాలు పెరిగాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న జాతీయ సమైక్యతా మండలి సమావేశంలో షిండే మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత అజెండాగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీలను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని షిండే అన్నారు. కాగా, అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ.. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు ప్రకటించారు.