బ్రేకింగ్‌.. బ్రేకింగ్‌ అత్తారింటికి దారేది.. లీక్‌!!

Attarintiki-Daredhi-movie-leakedషాకింగ్ న్యూస్‌..!
రియ‌ల్ బ్రేకింగ్ న్యూస్‌..!!
అత్తారింటికి దారేది. విడుద‌ల‌కు ముందే పైర‌సీ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అవును.. అత్తారింటికి దారేది తొలి సగం లీక్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో ద‌ర్శన‌మిస్తోంది. దాంతో చిత్రబృందంతో పాటు యావ‌త్ తెలుగు చిత్ర ప‌రిశ్రమ షాక్‌కు గురైంది. ఈ సినిమాని వ‌చ్చేనెల 9న విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నారు. అయితే కొంత‌మంది.. ఈసినిమా వీడియోని యూ ట్యూబ్‌లో పెట్టేశారు. ఇప్పుడు చిత్రబృందానికి ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు. ఈ షాక్ నుంచి తేరుకొని.. సినిమాని హ‌డావుడిగా ఈ వార‌మే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ రోజే.. దీనికి సంబంధించిన వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది. యూ ట్యూబ్‌లో సంబంధిత వీడియోని బ్లాక్ చేయ‌డానికి చిత్రబృందం కృషి చేస్తోంది. ఏదేమైనా ఇది అభిమానుల‌కు, చిత్రప‌రిశ్రమ‌ను క‌ల‌చి వేసే విష‌య‌మే.