రొమాంటిక్ హీరోగా ఎంట్రీ

ntrఎన్టీఆర్ తొడ‌గొడితే చూశాం. గొడ్డలి ప‌ట్టుకొంటే త‌రించాం. మీసం ట్రిమ్ చేసి.. ల‌వ‌ర్ బోయ్‌లా మారాడు. ఈసారి మాత్రం రొమాంటిక్ హీరోగా ద‌ర్శన‌మిస్తున్నాడు. రామ‌య్యా వ‌స్తావ‌య్యాలో. ఎన్టీఆర్ గెట‌ప్‌, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో స‌రికొత్తగా క‌నిపిస్తాయ‌ని… చిత్రబృందం చెబుతోంది. టీజ‌ర్‌, ట్రైట‌ర్‌లో ఆ సంగ‌తి తెలుస్తూనే ఉంది. ఎన్టీఆర్ కూడా… న‌న్ను హ‌రీష్ కొత్తగా చూపించాడు అని సంబ‌ర‌ప‌డిపోతున్నాడు. స్టూడెంట్ నెం.1, నాగ‌.. త‌ర‌వాత ఎన్టీఆర్ ని కాలేజీ స్టూడెంట్ గా చూపిస్తున్న ఘ‌న‌త‌.. హ‌రీష్ కే ద‌క్కుతుంది. క‌త్తులు మానేసి పుస్తకాలు ప‌ట్టుకొన్న ఎన్టీఆర్‌ని తెర‌పై ఎలా చూపిస్తాడో మ‌రి.