తెలంగాణ ప్రక్రియ ఆగిందా.. ?

seemandraతెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ముందుకెళ్లాలా… ? వెనక్కు వెళ్లాలా… ? తేల్చుకోలేని పరిస్థితుల్లో వున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ప్రకటన చేసినప్పటి నుంచి.. దానికి వ్యతిరేకంగా ఎవరెన్ని గంతులేసిన.. విభజన చేసి తీరుతామని గర్జిస్తూ వచ్చిన కాంగ్రెస్ పెద్దల స్వరంలో రోజు రోజుకు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా, నిన్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించి..రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని వారు అహ్మద్ పటేల్ నుకోరారు.

అయితే, ఈ సమావేశంలో అహ్మద్ పటేల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. “తెలంగాణపై తొందరపడ్డామేమో”నని అభిప్రాయాన్ని ఆయన సీమాంధ్ర నేతల వద్ద ప్రస్తావించారట. తెలంగాణ నేతల ఒత్తిడి వల్ల త్వరగా నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై ముందుకు గానీ.. వెనక్కు గానీ వెళ్లే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. సీమాంధ్ర నేతలు కల్పించుకొని సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిగణలోనికి తీసుకున్న తరువాతనే.. విభజన ప్రక్రియ ముందుక సాగుతుందని ఓ ప్రకటన వచ్చేలా చూడాలని కోరగా.. అది నా చేత్తుల్లో లేదని, సీడబ్ల్యూసీ తీర్మాణంలో మార్పులూ, చేర్పులూ చేయాలంటే.. అది అధినేత్రి సోనియాకే సాధ్యమని కూడా చెప్పారట. మీరు చెప్పిన సమస్యలను, సందేహాలను అన్నింటిని అధినేత్రి దృష్టికి తీసుకెళ్తానని అహ్మద్ పటేల్ సెలవుతీసుకున్నట్లు సమాచారం.

SoniaPranabఇక అదీగాక, తెలంగాణ విషయంపై స్పష్టమైన అవగాహాన వున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పలు సూచనలు చేశారట. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన ప్రణబ్ సూచనలు తేలికగా కొట్టిపారేసేవి మాత్రం కాదు. దేశ భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొని చేసినవిలా కనిపిస్తోంది. ఇంతకీ ఆ సూచలేమిటంటే.. శాసనసభలో ’తెలంగాణ తీర్మాణం’ ఆమోదం పొందకపోతే.. విభజన విషయంలో ముందుకు వెళ్లకూడదని సూచించారని తెలుస్తోంది. కాదూ.. గీదూ అని మొండిగా పోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని కూడా దాదా హెచ్చరించారట. శాసనసభ తీర్మాణంను పరిగణలోనికి తీసుకోకుండా విభజన చేస్తే ఇప్పుడు మాత్రం బాగనే వుంటుంది. కానీ.. భవిష్యత్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా… బీజేపీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను.. ఇదే ప్రాతిపదికన విభజిస్తూ పోతే పరిస్థితేంటని ప్రణభ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇటు దేశం ముక్కలవ్వడంతో పాటుగా.. అటు కాంగ్రెస్ కు కారుమబ్బులు కమ్మే అవకాశం వుందన్నది ప్రణబ్ భావన. దీంతో.. అధినేత్రి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

u8_Digvijay-Singh-Sushil-Kumar-Shindeఈ నేపథ్యంలోనే.. మొన్నటివరకు విభజన విషయంలో వెనక్కు తగ్గేది లేదని గర్జించిన.. పటేల్, షిండే, డిగ్గీ రాజా..తదితరుల స్వరంలో సామర్థ్యం తగ్గినట్లు సమాచారం. పైగా సీమాంధ్రలో 50రోజులకు పైగా ఊహించని రీతిలో జరుగుతున్న ఆందోళనలు. సీమాంధ్రలో నేతలను అడుగడున అడ్డుకుంటున్న ఆందోళన కారులు.. ఈ నేపథ్యంలో.. కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ ను తీసుకురావడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం జంకుతుందన్నది సుస్పష్టం. అలాకాక విభజనపై ముందుకు వెళ్లలేమని చెప్పలేని పరిస్థితి. అలా చెప్పిన యెడల తెలంగాణ రణరంగమవుతుందని తెలుసు. ఇప్పటికే టీ-జేఏసీ, టీ-నేతలు విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించుకుంటూనే.. తదుపరి కార్యాచరణను తయారు చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికింకా.. ఆగినట్టే అంటారా.. ? లేదా ఇక ముందుకు సాగినట్టే అంటారా.. వేచి చూడలి. ఏదేమైనా.. దశాబ్దాల చరిత్ర వున్న కాంగ్రెస్ కు ఇది పెనుసవాలే మరి.