దసరాకి వస్తాడయ్యా

ramayya-vastavayya-teaserఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆడియో విడుదల తేది త్వరలో ప్రకటిస్తారు. గతంలో దిల్ రాజు నిర్మించిన ‘కొత్త బంగారులోకం’, ‘బృందావనం’ సినిమాలను కూడా దసరాకు రిలీజ్ చేశారు. మరోసారి విజయదశమి సెంటిమెంటును కంటిన్యూ చేస్తున్నందుకు టీం చాలా ఎగ్జయిట్ గా వుంది. ఎన్.టి.ఆర్ – సమంత జంటగా కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ మ్యూజిక్ అందించారు.